: అమెరికాలో భారీ విధ్వంసానికి ‘ఉగ్ర’ కుట్ర.. రంగంలోకి దిగిన ఎఫ్బీఐ?


అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతున్న తరుణంలో భారీ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారని యూఎస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ఈ కుట్రకు పాల్పడనున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా న్యూయార్క్, టెక్సాస్, వర్జీనియా ప్రాంతాలలో భారీ పేలుళ్లకు, దాడులకు కుట్ర పన్నారన్న సమాచారంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాంటీ-టెర్రర్, హోమ్ లాండ్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఎఫ్బీఐ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News