: సమసిన పెట్రోల్ బంక్ డీలర్ల వివాదం.. తాత్కాలికంగా ఆందోళన విరమణ
కమీషన్ పెంపునకు చమురు సంస్థలు అంగీకరించడంతో పెట్రోల్ బంక్ డీలర్లు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. చమురు సంస్థలతో పెట్రోల్ బంక్ డీలర్ల చర్చలు సఫలమయ్యాయి. పెంచిన కమీషన్ ను ఈ నెల 15 నుంచి డీలర్లకు అందజేస్తామని, మిగిలిన సమస్యలు డిసెంబర్ 1 నాటికి పరిష్కరిస్తామని చమురు సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు డీలర్లు మాట్లాడుతూ, డిసెంబర్ 1 నాటికి సమస్యలు పరిష్కారం కాకపోతే, అపప్తి నుంచి ఆందోళన చేపడతామని అన్నారు.