: నాపై పీహెచ్ డీ చేస్తావా? నాలాగే పిచ్చోడిలా ఉన్నావే?: రాంగోపాల్ వర్మ


రాంగోపాల్ వర్మ సినిమా తీసినా, మాట్లాడినా, ట్వీట్ చేసినా సరే, సెన్సేషన్ అవుతుంది. అలాంటి వ్యక్తిపై పీహెడ్ డీ చేస్తానంటూ ప్రవీణ్ యజ్జల అనే విద్యార్థి ముందుకొచ్చాడు. ఆంధ్రాయూనివర్శిటీ నుంచి ఈ పీహెచ్ డీ చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, రాంగోపాల్ వర్మే స్వయంగా స్పందించాడు. తనపై పీహెచ్ డీ చేయాలనుకున్న విద్యార్థి ప్రవీణ్ గురించి తన ట్వీట్ లో.. ‘పీహెచ్ డీ చేయడానికి ‘నేను’ అంశమా? నన్ను ‘జూ’లో పెట్టాలని మా అమ్మాయి భావిస్తుంటుంది. ఇక్కడేమో, నాపై పీహెచ్ డీ చేయాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు. ఇవిగో..నాపై పీహెచ్ డీ చేసేందుకు ఉన్న అంశాలు ఇవేనట. నా మీద పీహెచ్ డీ చేయాలనుకుంటున్న ప్రవీణ్ యజ్జలకు ఒకవేళ నా లాగానే పిచ్చి ఏమైనా ఉందేమో అర్థం కావట్లేదు’ అని ఆ ట్వీట్ లో వర్మ పేర్కొన్నాడు. ‘ఇవిగో..నాపై పీహెచ్ డీ చేసేందుకు ఉన్న అంశాలు ఇవేనట’ అంటూ పేర్కొన్న వర్మ అందుకు సంబంధించి విషయసూచికను కూడా ఆ ట్వీట్ లో పొందుపరిచాడు.

  • Loading...

More Telugu News