: సమర్థ ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌కి మొదటి ర్యాంక్.. ప్రపంచ బ్యాంక్ ప్రకటన
సులభ వాణిజ్య విధానంలో ఇటీవలే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి మొదటి స్థానం లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ప్రపంచ బ్యాంకు ప్రకటించిన మరో అంశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. సమర్థ ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి ర్యాంక్ సాధించిందని, రాజస్థాన్ రెండు, కర్ణాటక మూడో ర్యాంకుల్లో ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.