: బొగ్గు గని కార్మికులు రాష్ట్ర సైనికులు: ఎంపీ క‌విత


కార్మికుల‌కు వార‌స‌త్వ ఉద్యోగాలు ఇవ్వడానికి అనుకూలంగా సింగ‌రేణి సంస్థ ఈ రోజు తీసుకున్న‌ నిర్ణ‌యంపై ఎంపీ క‌విత స్పందించారు. బొగ్గు గని కార్మికులు రాష్ట్ర సైనికులని ఆమె అన్నారు. వారి ఉద్యోగ బాధ్యత త‌మ‌దేనని చెప్పారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఎంతోమంది కార్మికులకు లబ్ధి చేకూరుతుంద‌ని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీ బాల్క‌సుమ‌న్ ఈ విష‌యంపై స్పందిస్తూ టీఆర్ఎస్ గెలిస్తే వార‌సత్వ ఉద్యోగాలు ఇస్తామ‌ని కేసీఆర్ ఆరోజే చెప్పార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News