: నాన్న ఆరోగ్యం మెరుగుపడింది: కరుణానిధి కుమారుడు అళగిరి
తలైవర్ బాగున్నారని, నాన్న ఆరోగ్యం మెరుగుపడిందని డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి చెప్పారు. చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధిని ఈరోజు ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల అస్వస్థతకు గురైన తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు. కాగా, అలర్జీ కారణంగా కరుణానిధి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.