: సింగరేణి కార్మికులకు శుభవార్త.. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సింగరేణి సంస్థ నిర్ణయం
కార్మికులకు వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి సంస్థ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో యువ కార్మికుల సంఖ్య పెరుగుతుందని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. 15 ఏళ్ల తరువాత మళ్లీ వారసత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఉద్యోగాలకు అర్హత వివరాలు... * అక్టోబర్ 11, 2016 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుగల కార్మికులు వారసత్వ ఉద్యోగాలు తమ వారికి ఇవ్వమని కోరడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు * ఉద్యోగికి సంబంధించి కొడుకు, అల్లుడు లేదా తమ్ముడు అర్హులు * ఉద్యోగం పొందేవారి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి