: ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు గుర్తొస్తున్నాయి: మమతా బెనర్జీ


ఎన్డీటీవీపై కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు నిషేధం విధించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సంఘటన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని తలపించిందని అన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించిన అంశాలను ప్రసారం చేయడంపై సమస్యలు ఉంటే వేరే విధంగా చర్యలు తీసుకోవాలి గానీ, ఈ విధంగా నిషేధం విధించడం సబబు కాదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సమయంలో ఎన్డీటీవీ కీలక సమాచారాన్ని ప్రసారం చేసిందని, దాని వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన సమాచార, ప్రసార శాఖ ఈ నిషేధ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీన ఎన్డీటీవీ ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News