: ఐపీఎల్ లో నేటి వినోదం
ఐపీఎల్ -6 లో భాగంగా ఈరోజు 'పుణె వారియర్స్-చెన్నై సూపర్ కింగ్స్' జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, నిన్న రాత్రి 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబయి ఇండియన్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టు అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. అటు, మ్యాచ్ కోల్పోయిన పంజాబ్ ప్రదర్శించిన అద్బుత పోరాట పఠిమ ఆకట్టుకుంది.