: టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసిన ప్రియుడు


టీవీ నటి, బాలికావధు సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వ్యభిచారం చేయాలంటూ ప్రత్యూషపై ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేశాడని తెలుస్తోంది. వారిద్దరూ చివరిసారిగా ఫోన్ లో మాట్లాడుకున్న సంభాషణలను 'ముంబై మిర్రర్' వెల్లడించింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇది జరిగినట్టు పేర్కొంది. ఈ ఫోన్ సంభాషణ నిడివి మూడు నిమిషాలు ఉంది. ఫోన్ లో ఆమె మాట్లాడిన మాటలు ఇవే... 'నటించడానికి, పని చేయడానికి నేను ముంబైకి వచ్చా. నా శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదు. కానీ, నన్ను ఈ రోజు ఎక్కడ ఉంచావ్? నువ్వు స్వార్థపరుడివి. నా పేరంతా పాడు చేశావ్. నా గురించి, నా తల్లిదండ్రుల గురించి జనాలంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేనెంత కుమిలిపోతున్నానో నీకు అర్థం కావడం లేదు'. ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా మాట్లాడుతూ, వ్యభిచారం చేయాలంటూ ప్రత్యూషపై రాహుల్ ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. రాహుల్ తో మాట్లాడిన చివరి కాల్ లో వ్యభిచారం అనే పదాన్ని ప్రత్యూష వాడిందని అన్నారు. ఏప్రిల్ 1న అంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు... ఎలాగైనా డబ్బు సంపాదించాలనేదే ప్రత్యూష తల్లిదండ్రుల కోరిక అని గతంలో రాహుల్ ఆరోపించాడు. డబ్బుకోసమే వారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ప్రత్యూషకు అవకాశాలు లేనప్పుడు తానే అండగా నిలబడ్డానని చెప్పాడు. ప్రస్తుతం రాహుల్ బెయిల్ పై ఉన్నాడు.

  • Loading...

More Telugu News