: వివాహేతర సంబంధం నేపథ్యంలో.. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి చంపిన తండ్రీకొడుకులు
గుజరాత్ గోకుల్ నగర్‌లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని వెంబడించిన తండ్రీకొడుకులు చివరికి అతడిని పట్టుకొని కొట్టి చంపేశారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. అమాలియా అనే వ్యక్తిని వెంటాడుతూ తండ్రీకొడుకులు బైక్ పై వచ్చారు. రోడ్డుపై పట్టుకొని అందరూ చూస్తుండగానే రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమాలియా తీవ్ర గాయాలతో రెండు గంటల పాటు రోడ్డుపైనే మృత్యువుతో పోరాడాడు. చివరకు అతడిని ఆసుపత్రికి తీసుకువెళుతుండగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.