: ఆఖరి ఐదు రోజులకు రూ. 166 కోట్లతో వ్యాపార ప్రకటనల స్లాట్స్ కొన్న ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే 8వ తేదీలోగా, వివిధ దినపత్రికలు, టీవీ చానళ్లలో వ్యాపార ప్రకటనల స్లాట్స్ కోసం భారీ ఎత్తున నిధులను కేటాయించారు డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ట్రంప్, పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న రాష్ట్రాల్లో మరింతగా వెచ్చించాలని నిర్ణయించారు. మొత్తం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 166 కోట్లు) విలువైన స్లాట్స్ ను తాను కొనుగోలు చేసినట్టు మద్దతుదారులకు ఈ-మెయిల్స్ ద్వారా ట్రంప్ తెలియజేశారు. కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, ఓహియో, అయోవా, మైనే, నార్త్ కెరోలినా, నెవాడా రాష్ట్రాల్లో తాము ముందున్నామని ఆయన గుర్తు చేస్తూ, ట్రెండ్ ఇలాగే కొనసాగితే, ఎన్నికల నాడు అధ్యక్ష పదవికి కావాల్సిన 266 ఎలక్టోరల్ ఓట్లు తమ ఖాతాకు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య వ్యత్యాసం తగ్గుతోందని, మిచిగాన్ లో హిల్లరీ ఆధిక్యం పడిపోతోందని వస్తున్న తాజా పోల్స్ తో ఆఖరి రోజులను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఖర్చులను భారీగా పెంచుతున్నారు ట్రంప్.

  • Loading...

More Telugu News