: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన కేసీఆర్, కేటీఆర్
ఈ రోజు 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా గవర్నర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నరసింహన్‌తో సచివాలయ భవనాల అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.