: విజ‌య్ మాల్యాపై నాన్ బెయిల‌బుల్ వారంట్ జారీ


భార‌తీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పులు చేసి విదేశాల‌కు పారిపోయిన వ్యాపార‌వేత్త విజ‌య్‌మాల్యాపై ఢిల్లీ ప‌టియాలా హౌజ్ కోర్టు ఈ రోజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు జారీ చేసిన స‌మ‌న్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మాల్యాపై నాన్ బెయిల‌బుల్ వారంట్ జారీ చేసింది. విజ‌య్ మాల్యాకు భారత్ కు తిరిగి వ‌చ్చే ఉద్దేశం లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే ప‌లుసార్లు ఆదేశాలు జారీ చేశామ‌ని, మాల్యాకు భార‌తీయ చ‌ట్టాల‌పై గౌర‌వం లేద‌ని వ్యాఖ్యానించింది. 2012లో చెక్‌బౌన్స్ కేసులో మాల్యాకు మ‌రో ఎన్‌బీడ‌బ్యూ జారీ చేసింది.

  • Loading...

More Telugu News