: పవన్ అభిమానులకు 'సారీ' అంటూ, మహేష్ బాబు అభిమానులను 'ఖుషీ' చేసిన హీరో సుమంత్!


తన తాజా చిత్రం ‘నరుడా డోనరుడా’ ప్రమోషన్‌ లో భాగంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో, హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీ అభిమాన నటుడు ఎవరు? అని ఓ అభిమాని ప్రశ్నిస్తే, పవన్ అభిమానులకు సారీ చెబుతూ, మహేష్ బాబు అభిమానులు ఖుష్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు. 'నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు... సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్' అని తడుముకోకుండా ఆన్సర్ చెప్పేశాడు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు, "నేను అందరి పెళ్లిళ్లకూ వెళ్తానే తప్ప, నా పెళ్లికి వెళ్లను" అంటూ తాను పెళ్లి చేసుకోనన్న విషయాన్ని చమత్కారంగా చెప్పాడు.

  • Loading...

More Telugu News