: 45 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆరంభంలో బలంగా కనిపించిన ఆస్ట్రేలియా జట్టు 45 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 242 పరుగులకు ఆలౌట్ కాగా, ఆపై తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. వార్నర్ 97, మార్షి 63 పరుగులు చేశారు. అయితే, 35 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఉన్న సమయంలో వార్నర్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా పతనం ప్రారంభమైంది. 167 పరుగుల వద్ద ఖవాజా, 168 పరుగుల వద్ద స్మిత్, 181 పరుగులు వద్ద ఎస్ఈ మార్ష్, ఎంఆర్ మార్ష్, 202 పరుగుల వద్ద వోగ్స్, 203 పరుగుల వద్ద స్టార్క్ అవుట్ అయ్యారు. ఆపై 232 పరుగుల వద్ద నివిల్ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సిడిల్ 17 పరుగులతో ఆడుతుండగా, హాజెల్ వుడ్ తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 69 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు.