: మెగాస్టార్ సినిమా హిట్ కావాలంటూ హోమం
చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, చిరు సినిమా సూపర్ హిట్ కావాలంటూ 'అఖిల భారత చిరంజీవి యువత' అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో అయినవిల్లి వినాయక ఆలయంలో అష్ట గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సమావేశానికి చిరంజీవి అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షుడు ఏడిద శ్రీను, పీసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, భారీ ఎత్తున చిరంజీవి అభిమానులు హాజరయ్యారు.