: పోలీసులే మైండ్ గేమ్ ఆడారు: వరవరరావు ఆగ్రహం
మావోయిస్టుల అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) క్షేమ సమాచారాన్ని విరసం నేత వరవరరావు ప్రకటించిన అనంతరం ఏపీ డీజీపీ సాంబశివరావు మవోయిస్టులు మైండ్ గేమ్ ఆడారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వరవరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులే మైండ్ గేమ్ ఆడారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో పోలీసులు గందరగోళం సృష్టించారని అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల అందరి ఆచూకీ గురించి పోలీసులు చెబితే తాము కోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. పదిరోజులుగా ఏం జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.