: లవ్ ఫెస్టివల్ కు, ప్రభుత్వానికి సంబంధం లేదు


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తోందంటూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాగరతీరంలో ప్రభుత్వం డిస్కో డ్యాన్సులు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీచ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. లవ్ ఫెస్టివల్ కు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులెవరూ ఆ ఫెస్టివల్ కు హాజరవడం లేదని చెప్పారు. ఫెస్టివల్ నిర్వహణ కోసం గోవాకు చెందిన కొందరు వ్యక్తులు పర్యాటక శాఖ, మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారని... మన సంస్కృతికి అది విరుద్ధమని తేలితే అనుమతి ఇవ్వబోమని తెలిపారు. ఈ విషయంపై వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News