: మహారాష్ట్రలో దారుణం.. 12 మంది విద్యార్థినులపై కీచకుల్లా ప్రవర్తించిన ఉపాధ్యాయులు
మహారాష్ట్రలోని బుల్దానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల తరువాత పిల్లల బాధ్యత గురువుపైనే ఉంటుందంటారు. కానీ ఉపాధ్యాయులే విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. తమ ఆడ పిల్లల్ని పాఠశాలలకు పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడే విధంగా ఉపాధ్యాయులు ప్రవర్తించారు. విద్యా బుద్ధులు చెప్పి విద్యార్థులను మంచి మార్గాల్లో నడిపించాల్సిన ఉపాధ్యాయులే 12 మంది విద్యార్థినులపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సదరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.