: 'పావు గంటలో పదివేలు' అంటూ... రూ. 750 కోట్లకు ఎదిగిన ఇండియన్ పోకర్!


పావుగంట వ్యవధిలో రూ. 10 వేలు సంపాదించాలంటే... తమ వద్దకు రమ్మంటున్నాయి ఆన్ లైన్ పోకర్ సైట్లు. రాహుల్... రోజుకు ఎనిమిది గంటల పాటు పేకాడటమే అతని పని. ఒక్కోసారి 15 నిమిషాల వ్యవధిలో రూ. 10 వేలు సంపాదిస్తాడు. అఫ్ కోర్స్ అంతే వేగంగా డబ్బులు పోతాయి కూడా. "ఓ సంవత్సరం నుంచి ఈ ఆట ఆటడం ప్రారంభించాను. లాజిక్ తో పాటు వ్యూహాత్మకంగా ఆలోచించే వారికి, లెక్కలు తెలిసిన వారికి ఇది చాలా ఆసక్తికరమైన ఆట" అని ఏనాటికైనా ప్రొఫెషనల్ పోకర్ ఆటగాడిగా ఎదగాలని భావిస్తున్న 26 ఏళ్ల రాహుల్ అంటున్నాడు. ఇండియాలో స్టార్టప్ సంస్థలుగా ప్రారంభమై ఆన్ లైన్ పోకర్ ఆడిస్తున్న అడ్డా 52, పోకర్ - బాజీ, స్పార్టాన్ పోకర్ తదితరాల్లో దాదాపు 50 వేల మందికి పైగా ఆడుతుండగా, ఈ కంపెనీలు సాలీనా రూ. 5 కోట్ల వరకూ లాభాలను ఆర్జిస్టున్నాయి. ఆన్ లైన్ పోకర్ గేమ్ ను స్కిల్డ్ గేమ్ గా ప్రకటించిన తరువాత ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చి ఈ గేమ్ ను ఆడిస్తున్నాయి. ఆన్ లైన్ పోకర్ మొదలు పెట్టి కొంతమంది ఆటగాళ్లను ఆకర్షించినా, లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ప్రతి గేమ్ లో ఆడుతున్న వారి బెట్టింగ్ మొత్తం నుంచి 15 శాతం ఆన్ లైన్ సంస్థకు వెళుతుంది కాబట్టి. ఇండియాలో పోకర్ ఆడుతున్న ప్రొఫెషనల్స్ సంఖ్య 1000 వరకూ ఉంటుందని అంచనా వేస్తుండగా, అందులో 95 శాతం మంది పురుషులే ఉన్నారు. ఆన్ లైన్ పోకర్ పరిస్థితి ఇలావుండగా, రమ్మీ ఆడిస్తున్న సైట్లు మరింతగా లాభాలను ఆర్జిస్తున్నాయి. క్లాసిక్ రమ్మీ, జంగ్లీ, తాజ్ రమ్మీ వంటి వెబ్ సైట్లు మరింతగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఈ కంపెనీలపై విమర్శలు వస్తున్నప్పటికీ, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు ఆన్ లైన్ రమ్మీని ప్రోత్సహిస్తూ వ్యాపార ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News