: ముందు ఊహించినట్టే వాళ్లు మైండ్ గేమ్ ఆడారు: ఆర్కే క్షేమ సమాచారంపై ఏపీ డీజీపీ
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని విరసం నేత వరవరరావు ప్రకటించడంపై ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందించారు. ఈ విషయాన్ని తాము ముందుగానే ఊహించామని, వాళ్లు మైండ్ గేమ్ ఆడారని ఆరోపించారు. గత 20 సంవత్సరాలుగా వాళ్లు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. తాము మొదటి నుంచి ఆర్కే పోలీసుల అదుపులో లేడని చెబుతూనే ఉన్నామని, ఆయన ఎన్ కౌంటర్ జరిగిన రోజే తప్పించుకున్నాడని చెబుతున్నా వారు పోలీసులపై నిత్యమూ ఆరోపణలు చేస్తూనే వచ్చారని అన్నారు. మావోల మైండ్ గేమ్, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడంపై జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తుతామని అన్నారు.