: ఏపీకి ప్యాకేజీపై నేడు కాకినాడలో బహిరంగ సభ.. వెంకయ్యకు సన్మానం


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.2.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నేడు బీజేపీ ఆధ్వర్యంలో కాకినాడలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును సన్మానించనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాపై పలు రకాల చర్చల అనంతరం ప్యాకేజీయే మేలని కేంద్రం భావించిందని తెలిపారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి త్వరలో చట్టబద్ధత వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సభ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News