: ఆయన రూటే సెపరేటు.. ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ కూడా సంప్రదాయానికి భిన్నంగానే దూసుకుపోతున్నారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఖాయమని అభిప్రాయపడుతున్న ఆయన మద్దతుదారులు అప్పుడే విజయోత్సవ ర్యాలీలకు సిద్ధమైపోతున్నారు. అదీ ఎన్నికలు జరిగే 8వ తేదీనే. శ్రేయోభిలాషులు, మిత్రులు, సన్నిహితులు, మద్దతుదారుల కోసం మన్‌హటన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో భారీ విజయోత్సవ వేడుక నిర్వహించనున్నట్టు ట్రంప్ ప్రచార శిబిరం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే అది విజయోత్సవ ర్యాలీ కాదని, తన మద్దతుదారులకు సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం మాత్రమేనని తెలుస్తోంది. కాగా తాజాగా న్యూయార్క్ టైమ్స్/సీబీఎస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు 42 శాతం, హిల్లరీకి 45 శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది. పోల్ ఫలితాలు రోజురోజుకు మారుతుండడంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News