: మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారు: వరవరరావు


మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారని విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేసినట్లు ఒక న్యూస్ ఛానెల్ పేర్కొంది. కాగా, ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఆర్కే ఆచూకీ గురించి తెలియకపోవడంతో పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నారని పౌరసంఘాలు ఆరోపించడం, ఈ విషయమై తక్షణం పోలీస్ శాఖ ప్రకటించాలంటూ ఆర్కే భార్య హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. ఆర్కే క్షేమంగా ఉన్నారంటూ వరవరరావు తాజా ప్రకటనతో ఉత్కంఠకు తెరపడినట్లయింది.

  • Loading...

More Telugu News