: బికినీ అంటే ఏమిటో నెట్ లో చూశాక అర్థమైంది: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు


బికినీ అంటే స్కర్టు అనుకున్నాను.. నెట్ లో చూశాక అసలు విషయం అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో ‘బీచ్ లవ్ ఫెస్టివల్’ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయమై ఆయన మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి ఫెస్టివల్స్ నిర్వహించడం మన సంప్రదాయం కాదని, మన సంస్కృతికి సరిపడదని అన్నారు. పర్యాటకరంగం అభివృద్ధి కోసమంటూ ఇటువంటి ఫెస్టివల్ ను నిర్వహించాలని అనుకోవడం సబబు కాదని, మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు మనకు అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News