: ‘మగధీర’తో పోల్చుకుని ఈ సినిమా చూడొద్దని ముందే చెప్పాం: నటుడు కార్తీ


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘మగధీర’తో పోల్చుకుని తన సినిమా ‘కాష్మోరా’ను చూడవద్దని ప్రేక్షకులకు ముందుగానే చెప్పామని ప్రముఖ నటుడు కార్తీ అన్నాడు. ఈ చిత్రం విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ‘కాష్మోరా’ చిత్రంలో కొన్ని యుద్ధ సన్నివేశాలను చూసేటప్పుడు ‘మగధీర’తో అసలు పోల్చుకోవద్దని ప్రేక్షకులకు ముందే చెప్పామని అన్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందని తాను ముందే ఊహించానని, అయితే, తాను ఊహించిన దాని కంటే ఇంకా పెద్ద హిట్ అయిందని కార్తీ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను తన అన్నయ్య, ప్రముఖ నటుడు సూర్యతో కలిసి చూశానని, ఈ చిత్రంలో తాను పోషించిన పాత్ర ‘రాజ్ నాయక్’ ఎంతగానో నచ్చిందని అన్నయ్య సంతోషపడ్డాడని కార్తీ చెప్పాడు.

  • Loading...

More Telugu News