: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వకూడదంటూ మతవిశ్వాసాల పేరుతో శిశువును ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన వ్యక్తి


కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో ఉన్న‌ ఓ ఆసుప‌త్రిలో మ‌త విశ్వాసాల పేరుతో ఓ వ్య‌క్తి అప్పుడే పుట్టిన బిడ్డకు హాని క‌లిగేలా ప్ర‌వ‌ర్తించాడు. శిశువుకు తల్లిపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అబు బక్ర్‌ అనే వ్యక్తి భార్యకు ఆసుప‌త్రిలో కాన్పు జ‌రిగింది. బిడ్డ‌కు పాలివ్వాల‌ని చెప్పిన డాక్ట‌ర్ల సూచ‌న‌కు ఆయ‌న అడ్డుప‌డ్డారు. మసీదులో ఐదు ప్రార్థనలు (ఆజాన్‌) పూర్తయ్యేవరకు త‌న బిడ్డ‌కు ఆహారం ఇవ్వ‌కూడ‌ద‌ని వాదించాడు. 24 గంట‌లు పాలు ఇవ్వ‌కూడ‌ద‌ని అన్నాడు. పాలు ఇవ్వ‌క‌పోతే శిశువు ప్రాణాలు పోతాయ‌ని డాక్ల‌ర్లు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివ‌రికి వైద్యుల‌తోనే గొడ‌వ‌కు దిగి తన భార్య, బిడ్డ‌ను తీసుకొని ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోయాడు. అనంత‌రం అత‌డు ఎక్క‌డికి వెళ్లాడో ఎవ‌రికీ తెలియ‌లేదు. అబు బక్ర్‌ తాము ఎంత‌చెప్పినా వినిపించుకోలేదని, శిశువుకు ప్రతి రెండుగంటలకు ఒకసారి పాలు త‌ప్ప‌కుండా ఇవ్వాల్సి ఉంటుంద‌ని డాక్ట‌ర్లు మీడియాకు తెలిపారు. ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోతున్న వారిని ఒప్పించేందుకు వైద్యులు, పోలీసులు ప్ర‌య‌త్నించినా ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద‌ని ఆసుప‌త్రి సిబ్బంది చెప్పారు. సిటీ మెడికల్‌ కాలేజీకి వెళుతున్నానని అబు బక్ర్ చెప్పి, గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News