: షెడ్యూల్ ప్రకారమే జీఎస్‌టీ వస్తుంది.. ఆహార ధాన్యాలపై సామాన్య ప్రజలకు పన్ను మినహాయింపు: అరుణ్ జైట్లీ
పన్నురేటు, పరిహారం చెల్లింపు అంశాలపై ఈ రోజు జీఎస్‌టీ ప్యానెల్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జీఎస్‌టీ ప్యానెల్ పన్నురేట్లను నాలుగు స్లాబులుగా 5, 12, 18, 28గా తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే జీఎస్‌టీ బిల్లు అమలు దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఆహార ధాన్యాలపై సామాన్యప్రజలకు పన్ను మినహాయింపు (జీరో ట్యాక్స్ రేట్) ఉంటుందని పేర్కొన్నారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5 శాతం పన్నురేటు ఉంటుందని చెప్పారు. శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లకు పన్నురేటును 28 శాతంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.