: ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. 9, 10 తేదీల్లో ఎన్డీటీవీ ప్రసారాలు బంద్
ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ ఎన్డీటీవీ ప్రసారాలు ఆగిపోనున్నాయి. 9, 10 తేదీల్లో 24 గంటల పాటు ఎన్డీటీవీ ప్రసారాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తలను ప్రసారం చేసే క్రమంలో నిబంధనలను పాటించకపోవడమే దీనికి కారణం. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు... ఎయిర్ బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేయడంతో, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఎన్డీటీవీపై కొరడా ఝుళిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 9 వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి 10 తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 24 గంటల పాటు ఎన్డీటీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.