: ఇషాంత్ కు కాబోయే భార్య ‘సింగ్ సిస్టర్స్’లో చిన్నది!
టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ పెళ్లి చేసుకోనున్న బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ గురించి చెప్పాలంటే... వారణాసికి చెందిన ఆమె ఆసియన్ గేమ్స్ సహా, భారత్ తరపున పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించింది. భారత్ మహిళల బాస్కెట్ బాల్ టీమ్ కు ఆమె కెప్టెన్ గా కూడా వ్యవహరించింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రతిమా సింగ్ ఐదుగురు అక్కచెల్లెళ్లు బాస్కెట్ బాల్ క్రీడాకారులే. ఆ ఐదుగురిలో ఆమె చిన్న వయస్కురాలు. మిగిలిన నలుగురు అక్కయ్యలు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు బాస్కెట్ బాల్ మ్యాచ్ లు ఆడారు. ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఒకే రంగంలో ఉండటంతో ‘సింగ్ సిస్టర్స్’గా వారు పాప్యులర్ అవడం గమనార్హం.