: ఓ ఇంటివాడు కానున్న ఇషాంత్ శర్మ.. పెళ్లి డేట్ ఫిక్సయింది
బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్ తో టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ పెళ్లి డేట్ ఫిక్సయింది. ఇషాంత్-ప్రతిమల వివాహం డిసెంబర్ 9వ తేదీన జరగనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఈ ఏడాది జూన్ లో ఇషాంత్-ప్రతిమ ఎంగేజ్ మెంట్ జరిగింది. కాగా, త్వరలో ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ కు ఇషాంత్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు రెండు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. నాల్గో టెస్టు ప్రారంభమైన రెండో రోజున ఇషాంత్ పెళ్లి జరగనుంది. చివరి రెండు టెస్టు మ్యాచ్ లకు ఇషాంత్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.