: నయీమ్ కేసులో ఆర్.కృష్ణయ్యను ప్రశ్నించడంపై మండిపడుతున్న బీసీ విద్యార్థులు.. ధర్నా


ఇటీవ‌లే తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన గ్యాంగ్ స్ట‌ర్ న‌యీమ్ కేసులో నార్సింగి పోలీసులు నిన్న ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయాధ్య‌క్షుడు ఆర్.కృష్ణయ్యను గంట‌సేపు విచారించి ప‌లు ప్ర‌శ్న‌లు అడిగిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై బీసీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కార్య‌క‌ర్త‌లు భ‌గ్గుమంటున్నారు. ఈ కేసులో కృష్ణ‌య్య‌ను తెలంగాణ స‌ర్కారు ఇరికించే య‌త్నం చేస్తోంద‌ని ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో వారు ధర్నాకు దిగారు. గ్యాంగ్ స్ట‌ర్‌ నయీమ్ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని వారు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News