: 150 కోట్లు కొల్లగొట్టిన 'యే దిల్ హై ముష్కిల్'


రొమాంటిక్ మ్యూజికల్ హిట్ సినిమా 'యే దిల్ హై ముష్కిల్' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా దేశీయ మార్కెట్లో రూ. 103.67 కోట్ల గ్రాస్ కలెక్షన్లు (రూ. 74.01 కోట్ల నెట్) వసూలు చేసిన ఈ సినిమా... ఓవర్సీస్ లో రూ. 47 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంమీద ఇప్పటి దాకా రూ. 150.67 కోట్లను (గ్రాస్) కొల్లగొట్టింది. ఈ వివరాలను ప్రముఖ ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. వీకెండ్ తర్వాత నాన్ హాలిడే టెస్ట్ ను కూడా ఈ సినిమా అధిగమించిందని అతను అభిప్రాయపడ్డాడు. శుక్రవారం రూ. 13.30 కోట్లు, శనివారం రూ. 13.10 కోట్లు, ఆదివారం రూ. 9.20 కోట్లు, సోమవారం రూ. 17.75 కోట్లు, మంగళవారం రూ. 13.03 కోట్లు, బుధవారం రూ. 7.63 కోట్లను వసూలు చేసిందని తరణ్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News