: ఏనుగుపై ఎక్కి ఆడుకున్న హీరో ఆర్య
అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమాలో భయంకరమైన విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ హీరో ఆర్య ప్రస్తుతం రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న కదంబన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాహస యువకుడిగా ఆయన కనిపించనున్నాడు. ఈ సందర్భంగా షూటింగ్‌లో భాగంగా తీసుకొచ్చిన ఏనుగుపై ఎక్కి ఆర్య ఆడుకున్నాడు. చిన్నపిల్లలు పెద్దలపై ఎక్కి 'ఏనుగమ్మ ఏనుగు' అంటూ ఆడుకుంటున్నట్లు, ఆర్య నిజమైన ఏనుగుపై ఎక్కి అదే ఆట ఆడుకున్నట్లు కనపడుతున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
Finally we have come to terms "WE ARE FRIENDS"