: నారా వారి నరకాసుర పాలన పోవాలి.. ‘బీచ్ లవ్ ఫెస్టివల్’ ను అడ్డుకుంటాం: ఎమ్మెల్యే రోజా


ఏపీలో నారా వారి నరకాసుర పాలన పోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్టణంలో తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 6న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను సీఎం చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. కాగా, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గోవా బీచ్ లో లవ్ ఫెస్టివల్ ను గతంలో నిర్వహించారు. ఇదే తరహాలో, విశాఖ తీరంలో కూడా బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News