: అఫ్ఘాన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు


ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు అమెరికా ద‌ళాలతో కలసి ఆ దేశ సైన్యం దాడులు కొన‌సాగిస్తోంది. తాజాగా తూర్పు నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని పచేర్‌ ఆగమ్‌ జిల్లాలో ద‌ళాలు వైమానిక దాడులు జ‌రిపాయి. ఈ దాడుల్లో ఇరాక్‌, సిరియాకు చెందిన ఆరుగురు అనుమానిత ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వగా, మరో ఆరుగురు ఇస్లామిక్ స్టేట్ సానుభూతిప‌రులకి తీవ్రంగా గాయాల‌య్యాయి. అయితే, ఈ దాడుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని అధికారులు తెలప‌లేదు. నంగర్‌హార్‌ ప్రాంతంలో అధికంగా ఉన్న‌ ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులే ల‌క్ష్యంగా ఈ దాడులు జ‌రుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిపిన వైమానిక దాడిలో మ‌రో 11 మంది ఉగ్ర‌వాదుల‌ను కూడా హ‌త‌మార్చిన‌ట్లు అక్క‌డి అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News