: నరేంద్ర మోదీ నుంచి ఆ అవార్డును స్వీకరించలేను: సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్


ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోవాల్సిన 'రాంనాథ్ గోయింకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం' అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్ తిరస్కరించారు. అవార్డుల ఫంక్షన్ నుంచి ఆయన బాయ్ కాట్ చేశారు. ఆయన తరపున అవార్డును హార్పర్ కాలిన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ క్రిష్ణ చోప్రా అందుకున్నారు. బాయ్ కాట్ చేసిన తర్వాత అక్షయా ముఖుల్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనకు దక్కడం చాలా గౌరవంగా ఉందని... కానీ, మోదీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. మోదీ పక్కన నవ్వుతూ ఒకే ఫ్రేమ్ లో నిల్చోవడం తనకు ఇష్టం లేదని... మోదీ ఆలోచనలతో తాను కూడా జీవిస్తున్నట్టు ఉంటుందని... అందుకే ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశానని తెలిపారు. అక్షయా ముఖుల్ పుస్తకం 'గీతా ప్రెస్, ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా'కు ఈ అవార్డు దక్కింది. 2015లో ఈ పుస్తకం విడుదలైంది. ఆ తర్వాత బుక్ ఆఫ్ ది ఇయర్, అట్టా గలాట్టా - బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ బుక్ ప్రైజ్ లను కూడా ఈ పుస్తకం కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News