: ఢిల్లీలోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 20 వాహనాలు
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యం అక్కడి వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అక్కడ పెరిగిపోయిన వాహనాల కాలుష్యానికి తోడు ఇటీవలే జరుపుకున్న దీపావళి పండుగ కారణంగా కాలుష్యం మరింత పెరిగింది. దీంతో ఈ కాలుష్యం దట్టమైన పొగమంచుతో కలిసి వాతావరణంలో వ్యాపిస్తోంది. ఈ రోజు ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. నోయిడా, ఆగ్రాలను కలిపే ఈ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ కారణంగానే తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.