: ఉద్యోగాల కోసం నాడు హైద‌రాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించాం: ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు


స‌మాజంలో మావ‌న వ‌న‌రుల అవ‌స‌రం అత్య‌ధికంగా ఉంటుందని, ఐటీ నిపుణుల‌ను ప్ర‌పంచానికి భార‌త్ అందిస్తోందని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమ‌రావ‌తిలోని ఐనవోలులో 'విట్‌' తొలిదశ ప‌నుల్లో భాగంగా వంద ఎకరాల్లో వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప‌నుల‌కి కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడు, సీఎం ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం చంద్రబాబు మాట్లాడుతూ... విట్‌లో చ‌దువుకున్న వారికి ఉన్న‌త‌స్థాయి ఉద్యోగాలు వ‌స్తాయని అన్నారు. ప్రైవేటు రంగంలో మొట్ట‌మొద‌టిసారిగా విట్‌కు శంకుస్థాప‌న చేస్తున్నామ‌ని చెప్పారు. విట్ రూపంలో ప్రపంచ‌స్థాయి విద్యాసంస్థ రావ‌డం శుభ‌సూచకంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. స్వ‌ల్ప‌కాలంలో అద్భుత నైపుణ్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నైపుణ్యాలు నేర్చుకోవాల‌న్న‌దే త‌న ఆకాంక్ష అని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లో విట్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తుందని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అమ‌రావ‌తిలో చ‌దువుకోవ‌డానికి విదేశాల నుంచి విద్యార్థులు వ‌చ్చేలా కృషి జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఇక్క‌డ చ‌దువుకున్న విద్యార్థులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌తమైన ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఐటీ ఎంతో ముందుకువెళుతోందని, ఉద్యోగాల కోసం నాడు హైద‌రాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించామ‌ని అన్నారు. అనంత‌రం ప్ర‌పంచంలోని ఎన్నో కంపెనీల‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చేలా చేశామ‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు అవ‌కాశాలిస్తే ఎంతో రాణిస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌ నాదెళ్ల‌, గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌లలా ఏపీ విద్యార్థులు రాణిస్తార‌ని అన్నారు. విద్యార్థులు విదేశాల్లో చ‌దువు కొన‌సాగించ‌డానికి ఎంతో సాయం చేస్తున్నామ‌ని చ‌ంద్ర‌బాబు అన్నారు.

  • Loading...

More Telugu News