: సికింద్రాబాద్‌లో తల్లిని కత్తితో పొడిచి చంపిన తనయులు
నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లినే ఇద్దరు కుమారులు హతమార్చిన దారుణ ఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లి సంజీవ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తల్లితో గొడవపడిన సదరు తనయులు ఆమెను కత్తితో పొడిచారు. దీనిని గమనించిన స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిలోనే ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.