: అమెరికాలో పోలయిన 2.80 కోట్ల ఓట్లు... 'ముందస్తు'కు మరింత మద్దతు


అమెరికాలో అమలవుతున్న ముందస్తు ఓటింగ్ విధానానికి మద్దతు మరింతగా పెరుగుతుండగా, 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 2.80 కోట్ల మంది ఈ విధానంలో తమ ఓట్లను వేసేశారు. హిల్లరీకి మద్దతుగా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్, ఫ్లోరిడాలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న వేళ, ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ క్రైస్ట్ వేదికపైకి వచ్చి, ప్రజలను ఓటేశారా? అని అడగగా, అక్కడున్న వారిలో అత్యధికులు తమ చేతులు పైకెత్తి చూపడం గమనార్హం. ఇక అమెరికాలో 2008 నుంచి ముందస్తు ఓటింగ్ కు ఆదరణ పెరుగుతూ వస్తుండగా, ఆ సంవత్సరం 30 శాతం మంది వరకూ ముందుగానే ఓటేశారు. ఇక ఈ దఫా అది 60 శాతం వరకూ వెళ్లవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News