: స్వామి సన్నిధిలో నిద్రచేయడానికి వచ్చి... శవాలై కనిపించిన ముగ్గురు మహిళలు


జోగులాంబ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారి వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉంటుందని స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేశామని... మృతులు ఎవరో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు, నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ముగ్గురు మహిళలు నది వద్ద సంచరిస్తుండగా వారిని జాలర్లు ఆరా తీశారని... తాము కర్ణాటకకు చెందిన వాళ్లమని, ఆంజనేయస్వామి సన్నిధిలో నిద్ర చేయడానికి వచ్చామని జాలర్లకు ఆ మహిళలు చెప్పినట్టు ఎస్సై తెలిపారు. వారే ఈ ఉదయం కృష్ణా తీరంలో శవాలై కనిపించారు.

  • Loading...

More Telugu News