: సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఏపీ ముందుండడానికి చంద్రబాబే కారణం: వెంకయ్యనాయుడు
సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాయని, ఇది ఎంతో అభినందించదగిన విషయమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయం (విట్) నిర్మాణానికి వెంకయ్యనాయుడు, రాష్ట్ర సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఏపీ ముందుండడానికి చంద్రబాబు నాయుడే కారణమని అన్నారు. ఇంజినీరింగ్ సాంకేతికతలో కేంద్ర సర్కారుతో గుర్తించబడినవి దేశంలో 13 సంస్థలు ఉన్నాయని అన్నారు. విట్ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమించారని చెప్పారు. అమరావతిలో అతితక్కువ కాలంలోనే సచివాలయ తాత్కాలిక భవనాన్ని నిర్మించారని కొనియాడారు. కొన్ని సమస్యలు ఉన్న ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి వచ్చారని అన్నారని అన్నారు.