: దక్షిణ కొరియా ప్రధాని, ఆర్థికమంత్రులకు ఉద్వాసన
దక్షిణ కొరియా ప్రధాని హ్వాంగ్ క్యో అన్ తో పాటు ఆ దేశ ఆర్థికమంత్రిని తొలగించారు. వీరిద్దరినీ తొలగించినట్టు ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ జ్యున్ హై ప్రకటించారు. హ్వాంగ్ క్యో స్థానంలో కిమ్ బ్యోంగ్ జూన్ ను కొత్త ప్రధానిగా నియమించారు. ఇప్పటి దాకా ఫైనాన్స్ సర్వీసెస్ కమిషన్ ఛైర్మన్ గా కిమ్ బ్యోంగ్ వ్యవహరించారు. దక్షిణ కొరియాలో ప్రధాని పదవి కేవలం నామమాత్రమైనది. దేశ అధ్యక్షుడికే పూర్తి అధికారాలు ఉంటాయి.