: అల్పాహార విందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లిన వెంకయ్యనాయుడు!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వెంకయ్యనాయుడిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు, ఆయనకు అల్పాహార విందును ఏర్పాటు చేయించారు. అల్పాహారం అనంతరం ఇద్దరు నేతలూ అమరావతి సచివాలయం సందర్శనకు వెళ్లనున్నారు. సచివాలయ భవనాల పరిశీలనతో పాటు అక్కడి ఉద్యోగులతో వెంకయ్యనాయుడు కాసేపు మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తరువాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకుంటారు. అనంతరం, ఇరువురూ, వీఐటీ యూనివర్శిటీ శంకుస్థాపన సభలో పాల్గొంటారు.