: 'పెళ్లి కుదిరింది.. త్వరలోనే ముహూర్తం' అంటూ అనుచరులకు చెప్పిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రి. విభజన వద్దని గట్టిగా పోరాడి, ఆపై 'సమైక్యాంధ్ర' పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందారు. ఆపై ఎవరికీ కనిపించకుండా, తన స్వగ్రామంలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడాయన బయటకు వచ్చారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ పంచాయతీ ఆఫీసుకు వచ్చి అభిమానులు, కార్యకర్తలను పలకరించారు. అందరినీ పేరు పేరునా క్షేమం అడిగారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త "ఏమన్నా... మమ్మల్ని ఏదో ఒక పార్టీలోకి తోయండి. దాన్ని పట్టుకు వేలాడుతుంటాము. మీరు ఏమీ చెప్పకపోతే ఎలా?" అని ప్రశ్నించడంతో, కిరణ్ స్పందించారు. "ఇప్పటికే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవరన్నది రహస్యం. త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే తెలుస్తుంది. శుభలేఖలు అందరికీ వస్తాయి. తొందరపడద్దు" అన్నారు. దీంతో కార్యకర్తల్లో కొత్త చర్చ మొదలైంది.

  • Loading...

More Telugu News