: మారని అమెరికా వడ్డీ రేట్లు... భవిష్యత్తులో పెంచక తప్పదని సంకేతం!


రెండు రోజుల పాటు సమావేశమై ఇన్వెస్టర్ల సరళిని నిశితంగా పరిశీలించిన యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండానే పరపతి సమీక్షను ముగించింది. మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లను సవరించే ధైర్యం యూఎస్ ఫెడ్ చేయబోదన్న నిపుణుల అంచనాల మేరకే ఫెడ్ నిర్ణయాలు ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో దూసుకెళుతూ ఉండి, ద్రవ్యోల్బణం పెరిగిన పక్షంలో తదుపరి డిసెంబర్ నెలలో జరిగే సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న సంకేతాలను ఫెడ్ అధికారులు ఇచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ముందుగా అనుకున్న విధంగానే 2 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పుకోవడానికి మరిన్ని సాక్ష్యాలు అవసరమని ఫెడ్ తన పరపతి సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News