: భార్య తీరు నచ్చక.. ఆమె ముక్కు కొరికిన భర్త


భార్య తీరు నచ్చకపోవడంతో ఆమె ముక్కును కొరికేశాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగింది. అక్కడి మోతీనగర్ గ్రామానికి చెందిన శివకుమార్, రాంపూర్ జంగల్ కి చెందిన రాజకుమారితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే, రాజకుమారి చదువుకునేందుకు అత్తింట్లో అనుమతి లభించలేదు. దీంతో, తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదికాలంగా అక్కడే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు భర్త శివ తన అత్తగారింటికి వెళ్లాడు. అయితే, కంప్యూటర్ కోర్సులో చేరానని, రావడం కుదరని చెప్పింది. అలాగే రాజకుమారి కంప్యూటర్ క్లాసుకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు ధరించింది. ఈ విధమైన వస్త్రధారణ శివకు నచ్చలేదు. దీంతో వారి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మరింత ముదిరి ఘర్షణ కు దారితీసింది. దీంతో ఆగ్రహించిన శివ తన భార్యపై దాడి చేయడమే కాకుండా, ఆమె ముక్కును కొరికేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజకుమారిని ఆమె కుటుంబసభ్యులు సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News