: నా కల నిజమైంది.. హ్యాపీగా వుంది!: హార్ధిక్ పాండ్యా
టీమిండియా తరపున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలన్న తన కల నిజమైందంటూ హార్ధిక్ పాండ్యా సంతోషపడిపోతున్నాడు. ఇంగ్లండ్ తో జరగనున్న ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ లకు భారత్ టీమ్ ను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ టీమ్ లో తన పేరు ఉండటంపై పాండ్యా స్పందించాడు. తనపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ తో పాండ్యా తన కెరీర్ ప్రారంభించాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డేల్లోకి ప్రవేశించిన పాండ్యా, ఇప్పుడు టెస్టుల్లోకి ప్రవేశిస్తున్నాడు.